భారతదేశం, జనవరి 22 -- గుంటూరులో ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మైదానంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణ పరిశీలించారు.

ఈ ర్యాలీ ఫిబ్రవరి 17 నుండి 27 వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ చెందిన పురుష అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది. నియామక ప్రక్రియ సజావుగా సాగేందుకు లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా జాయింట్ కలెక్టర్ నొక్కి చెప్పారు. అభ్యర్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని, జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లరికల్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ కేటగిరీలకు నియామకాలు జరుగుతాయన్నారు.

ఎంపిక ప్రక్రియ నాగార్జున విశ్వవిద్యాలయంలోని సింథటిక్ ట్రాక్‌పై 1.6 కి....