భారతదేశం, సెప్టెంబర్ 8 -- నంద్యాల జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం(WDCW) పరిధిలో 6 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లలోని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు సంబందించి 3 పోస్టులు ఉండగా.. అంగన్వాడీ ఆయాల పోస్టులు 67 ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు కావాల్సిన అర్హతలు చూసుకుంటే.. అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తేదీ 01.07.2026 నాటికి 21 వ సం.ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు లోపు వారై ఉండాలి. తప్పనిసరిగా వివాహితురాలై, స్థానిక నివాసితురాలు కావాలి.

ఎస్సీ, ఎస్టీ జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిలలో 21 సం. వయసు నిండిన వారు లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వారి...