భారతదేశం, ఆగస్టు 5 -- ఎఫ్ఎమ్‌సిజి (FMCG) దిగ్గజం, పారాచూట్ బ్రాండ్ మాతృ సంస్థ మారికో లిమిటెడ్ (Marico Ltd) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ముడిసరుకైన కొబ్బరి (కొప్రా) ధరలు తగ్గడం, దేశీయంగా విక్రయాల పరిమాణం (Volume Growth) పుంజుకోవడంతో కంపెనీ అత్యుత్తమ లాభాలను సొంతం చేసుకుంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారికో ఏకీకృత నిర్వహణ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 22.8 శాతం పెరిగి రూ. 3,957 కోట్లకు చేరుకుంది. కంపెనీ నికర లాభం 27 శాతం వృద్ధితో రూ. 652 కోట్లుగా నమోదైంది. గత 20 త్రైమాసికాల్లో ఎన్నడూ లేని విధంగా దేశీయంగా వాల్యూమ్ గ్రోత్ 11 శాతంగా నమోదు కావడం విశేషం.

ఇక కంపెనీ ఎబిటా (EBITDA) 25 శాతం పెరిగింది. ఇది గడిచిన 28 త్రైమాసికాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి. దీనికితోడు ఎబిటా మార్జిన్ 40 బేసిస...