భారతదేశం, ఆగస్టు 9 -- ఎక్కడ తక్కువ ధర ఉంటుంది అని చూడటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారి కోసం ఓ యాప్ వచ్చింది. ఉబర్, ఓలా, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్ ఫామ్‌ల ధరలను చెక్ చేసుకునేందుకు ఆ యాప్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ఆండ్రాయిడ్ యాప్ కంపారిఫై ఈ పనిని మరింత సులభతరం చేయడం ద్వారా మీ బడ్జెట్‌ను కాపాడుతుంది.

ఇప్పుడు మీరు క్యాబ్ ధర తెలుసుకోవాలనుకున్నా లేదా ఇంటి నుండి కిరాణా సరుకులను ఆర్డర్ చేయాలనుకున్నా కంపారిఫైలో ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఉబర్, ఓలా, రాపిడో, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి యాప్‌ల నుండి రియల్ టైమ్ ధరలను మీ ముందు ఉంచుతుంది. ప్రతిసారీ యాప్ లను మార్చాల్సిన అవసరం లేకుండా కిరాణా షాపింగ్, టాక్సీల చౌకైన రేట్లను పోల్చి చూసుకోవచ్చు.

ఉబర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ యాప...