భారతదేశం, జూన్ 6 -- ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య తీరాలని చాలా మంది దేవుళ్లను మొక్కుతారు, రకరకాల పరిహారాలను పాటిస్తారు. అయితే వివాహం అవ్వక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు ఈ మహిమగల క్షేత్రాన్ని సందర్శించాలి. ఈ ఆలయం విశిష్టత గురించి మీరు కూడా విని ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మురమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానం చాలా మహిమాన్వితమైనది. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. అందుకే చాలామంది ఇక్కడికి వెళ్తూ ఉంటారు.

మన దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలో ప్రతిరోజూ రాత్రి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు. పెళ్లి అవ్వక ఎదురుచూస్తున్న వారు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మక...