భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఎన్నికల కమిషన్ (ఈసీఐ) పనితీరుపై ప్రజాస్వామ్యంలో నమ్మకం కలగాలంటే దాని నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)లతో కూడిన ముగ్గురు సభ్యుల నిష్పాక్షిక కమిటీని పునరుద్ధరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో ఓటర్ల జాబితాలు, డేటాబేస్ ప్రాసెస్, ఈసీనెట్ (ECINet) నిర్వహణపై దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన కథనాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఈ పరిణామాలు ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తున్నాయని ఎక్స్ (X) వేదికగా ఆందోళన వ్యక...