భారతదేశం, సెప్టెంబర్ 16 -- తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై ప్రధానంగా చర్చించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు ఈ పాలకమండలి నియమించిన తర్వాత జరిగే మెుదటి బ్రహ్మోత్సవమని చెప్పారు.

ఈ నెల 23వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో జరగనుందని బీఆర్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 24వ తేదీ మీనలగ్నంలో ధ్వజారోహణం ఉంటుందన్నారు. 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.

'గతంకంటే భిన్నంగా బ్రహ్మాండంగా...