భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈవారం ప్రతి భాషలో, ప్రతి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు, ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కిస్, మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ రోస్లిన్ లాంటివి వస్తున్నాయి.

నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'హనీ' ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం అంటే ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) వెల్లడించింది. ఇందులో దివ్యా పిళ్లై, దివి వాద్యా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా అదే రోజున అదే ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.

ఇది జీ5 (ZEE5) అందిస్తున్న...