భారతదేశం, అక్టోబర్ 16 -- దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవిని పూజిస్తాము. నవరాత్రుల్లో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. విద్యార్థులు సరస్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన చదువులో బాగా రాణించడానికి వీలవుతుంది.

అయితే, నేడు నవరాత్రుల్లో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిని ఆరాధించాలి. విద్యార్థులు చదువులో ఏకాగ్రత, జ్ఞానం పొందడానికి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసుకోవడానికి అమ్మవారిని ఆరాధిస్తారు. అయితే, అమ్మవారిని పూజించేటప్పుడు కచ్చితంగా ఈ మంత్రాలు, స్తోత్రాలు చదివేటట్టు చూసుకోండి.

ముందుగా గణపతి పూజ చేసి, ఆ తర్వాత సరస్వతీ దేవిని కూడా ఆరాధించండి.

ఓం వరప్రదాయై నమః.. ఇలా అష్టోత్తరం (108 నామాలను) చదువుతూ సరస్వతీ దేవికి పుష్పాలు, అక్షింతలు, పసుపు, కుంకుమలను సమర్పించండి. తర్వాత అమ్మవారికి సంబంధించిన ఈ శ్లోకాలు కూడ...