భారతదేశం, ఆగస్టు 14 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ఒక్కోసారి శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 14, అనగా ఈరోజు ఆకాశంలో అత్యంత కీలకమైన గ్రహగమనం చోటు చేసుకోబోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12:37కి బుధుడు, కుజుడు మధ్య దశాంక యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో రెండు గ్రహాలు దాదాపు 36 డిగ్రీల కోణంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలు కలగబోతున్నాయి.

కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో బుధుడితో పాటు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు కూడా కొలువై ఉండడంతో ఈ సంయోగం ప్రాధాన్యత మరింత పెరిగింది.

బుధుడు బుద్ధిశీలత, ఆలోచనలు, వ...