భారతదేశం, జూలై 3 -- విఘ్నాలను తొలగించడానికి వినాయకుడిని మనం ఆరాధిస్తాము. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్నా, పెళ్లిళ్లు వంటివి జరపాలన్నా కచ్చితంగా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. అయితే, జూలై 3, శుక్రవారం అనగా ఈరోజు సంకటహర చతుర్థి. ఈ విశేష దినాన వినాయకుడిని ఆరాధించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఆ వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పైగా, ఈరోజు శ్రవణ నక్షత్రం. ఇది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. అందులోనూ శుక్రవారం కలిసి రావడం మరింత విశేషం. శుక్రవారాన్ని సద్వినియోగం చేసుకుని, ఈరోజును సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు.

ఈరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, గణేశ పంచరత్నాన్ని 11 సార్లు చదువుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. సంకటనాశన గణేశ స్తోత్రం 9 సార్లు పారాయణం చేస్తే కూడా విశేషమైన ఫలితాల...