భారతదేశం, సెప్టెంబర్ 17 -- హిందూ సంప్రదాయంలో గురువారాన్ని విష్ణుమూర్తికి, వినాయకుడికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు భక్తిశ్రలతో పూజలు చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక గ్రహ నక్షత్రాల గమనం ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుండగా, మరికొన్ని రాశుల వారు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేటి దినఫలాలు ఎలా ఉన్నాయో కూలంకషంగా పరిశీలిద్దాం.

నేడు మీ వృత్తి జీవితం, ఆర్థిక పరిస్థితి సాధారణంగా సాగిపోతాయి. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం మంచిది. ఆరోగ్య పరంగా చర్మ సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి. డైట్‌లో పచ్చని కూరగాయలను చేర్చుకోవడం ద్వారా శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవచ్చు.

లక్ష్యాలను సాధించడానికి నేడు మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్స...