భారతదేశం, ఏప్రిల్ 2 -- ప్రతి ఒక్కరూ భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. విష్ణువు అనుగ్రహం ఉంటే కష్టాల నుంచి బయట పడొచ్చు. గురువారం నాడు ప్రత్యేకించి విష్ణువును ఆరాధిస్తారు. పైగా ఈ గురువారం నాడు పౌర్ణమి కూడా ఉంది. అంతే కాకుండా ఈరోజు హనుమాన్ జయంతి కూడా.

పౌర్ణిమ, గురువారం రావడం చాలా విశేషమైనదని చెప్పచ్చు. ఈ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే, విష్ణువు అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అన్ని కష్టాల నుంచి బయటపడడానికి వీలవుతుంది. మరి గురువారం పౌర్ణమి సందర్భంగా ఏం చేస్తే కలిసి వస్తుంది? ఎలాంటి పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, స్నానం చేసి పూజ గదిలో విష్ణు విగ్రహం లేదా ఫోటోని పెట్టి పూజించాలి. అలాగే విష్ణువుకు నెయ్యి దీ...