భారతదేశం, అక్టోబర్ 24 -- గ్రహాలు, నక్షత్రాల నిరంతర సంచారం మనుషుల జీవితాలపై, ప్రతి రోజూ ఎదురయ్యే అనుభవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవనంలో ఎలాంటి మార్పులు రానున్నాయో పరిశీలిద్దాం.

ఈరోజు మీకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అడుగు ముందుకు వేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి గందరగోళం, మానసిక ఒత్తిడి మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం తగదు. ఏ చిన్న అసౌకర్యం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

వృషభ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానిక...