భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశిగా జరుపుకుంటాము. ఏకాదశి విష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి, అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుక్రవారం రావడం మరింత శక్తివంతమైనదని చెప్పొచ్చు. అయితే ఈ అమలక ఏకాదశి నాడు ఏం చేయాలి? ఎలా పూజ చేయాలి? ఉసిరి దీపాలను ఏ విధంగా వెలిగించుకోవాలి? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

శ్రీమహా విష్ణువు అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట. అందుకని ఈ ఏకాదశి నాడు పూజ చేయడం వలన ఎంతో విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది. ఇంట్లో పూజ చేయాలనుకుంటే పూజ గదిలో ఉసిరి కొమ్మును పెట్టి పూజించొచ్చు. వరి పిండిలో బెల్లం, అరటిపండు కలిపి ముద్దలా చేసుకుని దాంతో పిండి దీపాలను చేసుకోవాలి. ఈరోజు పిండి దీపాలను వెలిగిస్తే కూడా చాలా మంచిది. రెండు, ఐదు, ఏడు, ...