భారతదేశం, నవంబర్ 21 -- దేశంలోని అత్యంత సంపన్నులు సేవా కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుబేరులు ఏకంగా రూ. 11,554 కోట్లు విరాళంగా అందించారు. అంతకుముందు ఏడాది నమోదైన రూ. 10,380 కోట్లతో పోలిస్తే దాతృత్వ విరాళాలు 11 శాతం పెరిగాయి. నవంబర్ 20న విడుదలైన 'ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్-2026' ఈ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది.

దేశంలో సంపద సృష్టితో పాటు సామాజిక బాధ్యతగా తిరిగి సమాజానికి ఇచ్చే సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. తాజా జాబితాలో మొత్తం 219 మంది దాతలు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జాబితాలో కేవలం 12 మంది కొత్త దాతలు చేరగా, ఈసారి ఏకంగా 45 మంది కొత్తగా జాబితాలోకి రావడం విశేషం.

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజ్ ఛైర్మన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరోసారి దేశ...