భారతదేశం, ఆగస్టు 12 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారుల విత్‌డ్రాయల్ నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. 'ఈపీఎఫ్ స్కీమ్ 2026' అమలులోకి రావడంతో పీఎఫ్ సొమ్ము, పెన్షన్ ఉపసంహరణ విధానాలపై పొదుపుదారుల్లో తలెత్తిన అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆగస్టు 10న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే లిఖితపూర్వక సమాధానమిస్తూ నూతన మార్గదర్శకాలను వివరించారు.

ఉద్యోగం వదిలేసిన వెంటనే పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకునేందుకు ఇకపై వీలుండదు.

ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్ (EPF Final Settlement): గడువుకు ముందే పీఎఫ్ ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసి మొత్తం నిధులు ఉపసంహరించుకోవడానికి 12 నెలల వెయిటింగ్ పీరియడ్ నిర్దేశించారు.

ఈపీఎస్ పెన్షన్ విత్‌డ్రావల్ (EPS Withdrawal): ఉద్యోగుల పెన్షన్ పథ...