భారతదేశం, ఆగస్టు 12 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఆన్‌లైన్ పోర్టల్‌లో చేపట్టిన సాంకేతిక వ్యవస్థ మార్పుల తర్వాత అనేకమంది ఉద్యోగుల సర్వీస్ హిస్టరీలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు కంపెనీలలో పనిచేసిన తేదీలు ఒకేసారి రావడం (Overlapping records), పనిచేసిన కొన్ని కంపెనీల పేర్లు కనిపించకపోవడం లేదా కంపెనీలో చేరిన తేదీలు (Date of Joining) తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇవి చిన్న పొరపాట్లుగా అనిపించినప్పటికీ, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పీఎఫ్ సొమ్మును బదిలీ (PF Transfer) చేసుకోవడానికి, పీఎఫ్ ముందస్తు విత్‌డ్రావల్‌కు, పెన్షన్ (EPS) కాలపరిమితిని లెక్కించడానికి మరియు కొత్త కంపెనీ నిర్వహించే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV) ప్రక్రియకు తీవ్ర అడ్డంకిగా మారవచ్చు.

సార్వత్రిక ఖాతా సంఖ్య (UAN) అనేది ప్రతి ఈపీఎఫ్ సభ్యునికి క...