భారతదేశం, నవంబర్ 1 -- న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని 2026 నవంబర్ 1న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తోంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటనలో తెలిపింది. కోట్లాది మంది చందాదారులకు పీఎఫ్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌ఓ పలు వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చందాదారుల ప్రయోజనం కోసం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉండి, మూతపడి లేదా సుదీర్ఘకాలంగా వాడకంలో లేని (Inoperative) ఈపీఎఫ్ ఖాతాలను నేరుగా ఆటోమేటిక్ పద్ధతిలో పరిష్కరించనున్నారు (Auto Settlement). దీనివల్ల చిన్న మొత్తం నిల్వ ఉన్న ఖాతాదారులు ప్రత్యేకంగా దర...