భారతదేశం, జూలై 2 -- కోట్లాది మంది ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వ్యవస్థలో భారీ మార్పులను ప్రకటించింది. రిటైర్మెంట్ సేవలను మరింత వేగంగా, సులభంగా మరియు పారదర్శకంగా మార్చేందుకు ఒక సరికొత్త 'డిజిటల్-ఫస్ట్' ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకువచ్చింది.

ఈ మార్పుల వల్ల పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో కాగితపు పని తగ్గడమే కాకుండా, అనవసరమైన ఆలస్యానికి కూడా చెక్ పడనుంది.

ప్రభుత్వం పాత నిబంధనలను రద్దు చేస్తూ 2026 సామాజిక భద్రతా కోడ్ కింద మూడు అప్‌డేటెడ్ పథకాలను నోటిఫై చేసింది.

ఇవి 1952, 1971, 1976, 1995 నాటి పాత నిబంధనల స్థానంలో అమలులోకి రానున్నాయి. అయితే, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవు. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ కూడా బేసిక్ శాలరీలో ఎప్పటిలాగే 12 శాతం చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తారు. కానీ, క్లెయిమ...