Andhrapradesh, సెప్టెంబర్ 20 -- మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.

ఇవాళ(20-09-25) కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోన...