భారతదేశం, సెప్టెంబర్ 20 -- దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈనెల 22 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీతో ఈ సెలవులు పూర్తి అవుతాయని పేర్కొంది. తిరిగి అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం. మొత్తం 11 రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. నిజానికి విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం. ఈనెల 24 నుంచి సెలవులు ప్రారంభం కావాలి. కానీ ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతూ వచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన విద్యాశాఖ..ఈ నెల 22 నుంచి అక్టోబర...