Telangana,hyderabad, సెప్టెంబర్ 13 -- ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం అత్యవసరంగా భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం. కాలేజీల బంద్ కు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు వినతిపత్రం కూడా అందజేశారు.

రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఈ లేఖలో తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర అన్ని ప్రైవేట్‌ వృత్తి విద్యా కళాశాలలను నిరవధ...