భారతదేశం, ఆగస్టు 11 -- శ్రావణ మాసం ఆగమనం కోసం ఎదురుచూస్తున్న తెలుగు ఇళ్లలో శుభకార్యాల పర్వం మొదలుకానుంది. శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పల్లెల నుంచి పట్టణాల వరకు వైభవంగా పెళ్లి బాజాలు మోగేందుకు సర్వం సిద్ధమవుతున్నాయి.

ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలు వచ్చే నెల 11వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. సుమారు నెల రోజుల పాటు అద్భుతమైన ముహూర్తాలు అందుబాటులో ఉండటంతో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు అత్యంత పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ శ్రావణ సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఆషాఢ మాసం ఉండటంతో ఎలాంటి మంచి ముహూర్తాలు లేక ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మంటపాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు శ్రావణ మాసం ప్రవేశి...