భారతదేశం, ఆగస్టు 2 -- ఖగోళ శాస్త్ర చరిత్రలోనే 2026 అత్యంత అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ ఏడాది ఆగస్టు 12న సంభవించబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అద్భుత ఖగోళ ఘట్టం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. దాంతో గ్రహణం కనిపించే ప్రాంతాల్లో పగటిపూట కూడా గాఢాంధకారం అలుముకుని, కాసేపు రాత్రిని తలపిస్తుంది.

ఈ గ్రహణంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 100 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. శతాబ్దం కాలంలో తొలిసారిగా ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యాటకుల దృష్టి ఇప్పుడు స్పెయిన్‌పైనే నిలిచింది.

దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ దృశ్యం అద్భుతంగా ఆవిష్కృతం కాన...