భారతదేశం, ఆగస్టు 4 -- భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రాజెక్టుల కోసం రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెల్లో (JRF) విభాగాల్లో మొత్తం 48 ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పోస్టులన్నీ తాత్కాలిక/ప్రాజెక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in లేదా nrsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివిధ పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతల మార్కుల శాతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

M.E. / M.Tech: కనీసం 60% మార్కులు లేదా 10-పాయింట్ల స్కేల్‌పై 6.5 CGPA/CPI ఉండాలి.

M.Sc / M.Sc Tech: కనీసం 65% మార్కులు (అన్ని సెమిస్టర్ల సగటు) లేదా 6.84 CGPA/CPI ఉండాల...