భారతదేశం, నవంబర్ 15 -- బాలీవుడ్ జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వివాహం జరిగిన నాలుగేళ్లకు వారు తమ తొలి సంతానాన్ని ఆహ్వానించారు. అది కూడా వారి పెళ్లిరోజునే తొలి బిడ్డకు జన్మనివ్వడం వారి జీవితంలో అత్యంత మధురమైన రోజుగా నిలిచిపోయింది.

ఇవాళ (నవంబర్ 15) తమకు బేబీ గర్ల్ పుట్టినట్లు ప్రకటించారు రాజ్ కుమార్ రావు, పత్రలేఖ. దీంతో రాజ్ కుమార్, పత్రలేఖ జంట నాలుగో వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబంలోకి ఒక ఆడపిల్లను స్వాగతిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సెలబ్రిటీ జంట తమ అపారమైన ఆనందాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ హృదయపూర్వక వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లి రోజునే తమకు కూతురు పుట్టడంతో హీరో హీరోయిన్ల ఆనందం మరింత రెట్టింపుగా మారింది.

శనివారం నాడు రాజ్ కుమార్, పత్రలేఖ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కల...