భారతదేశం, నవంబర్ 2 -- ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR)పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నాయకత్వం భారీ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి రానున్నారు.

ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 'ఓట్ బచావో' పేరిట ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహం మోపి జైలుకు పంపుతామని.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చట్టం నుంచి తప్పించుకోలేరని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వేదికగా జరిగే పాదయాత్ర బహిరంగ సభ ద్వారా క...