భారతదేశం, అక్టోబర్ 13 -- తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా నదీ జలాలను విడుదల చేయాలని కోరనున్నారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం(ఇవాళ) మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా వెళ్లి సాయంత్రం 4:15 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అధికారిక చర్చల్లో పాల్గొంటారు. తెలుగు గంగా ప్రాజెక్ట్ కింద చెన్నై నగరానికి రావాల్సిన కృష్ణా నీటిని వేగంగా విడుదల చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారిన గోదావరి - కృష్ణా - కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై కూడా ఇద్దరు ముఖ...