భారతదేశం, నవంబర్ 26 -- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులు, గదులు సరైన దిశలో ఉంటే సానుకూల ఫలితాలు దక్కుతాయి. సరికాని దిశలో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఇంటి వంటగది ఏ దిశలో ఉండాలి, ఏ దిశలో కడితే నష్టం కలుగుతుంది, వంట చేసేటప్పుడు ఏ వైపు తిరిగి ఉండాలి వంటి విషయాలపై స్పష్టత అవసరం. వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో ఆనందం, ఆరోగ్యం నిలుస్తాయని నిపుణులు చెబుతారు.

ఇల్లు కట్టేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు వాస్తు సూత్రాలకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇళ్ల నిర్మాణ పద్ధతులు, స్థల సౌకర్యాన్ని బట్టి ఆచరణలో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి. వాస్తు నియమాలు సాధారణ మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.

వంటగదిని ఎల్లప్పుడూ ఆగ్నేయ మూలలోనే నిర్మించాలి. ఏ కారణం చేతనైనా ఈశాన్య దిశలో మాత్రం వంటగది కట్టకూడదు. ఆగ్నేయంలో వీలుకాకపోతే వాయవ్య మూలలో ఏర్...