భారతదేశం, మే 15 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 15 ఎపిసోడ్ లో.. కొత్త కారు కొన్న ధీరజ్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. కారును చూసి ధీరజ్ మురిసిపోతాడు. కారు చాలా బాగుందని వేదవతి, రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతారు. గుడికి వెళ్దామని వేదవతి అంటే.. అమ్మనే పూజ చేయమంటాడు ధీరజ్.

డౌన్ పేమెంట్ కట్టకుండా నేరుగా ఈఎంఐలోనే కారు తీసుకున్నా. ఈఎంఐ కాస్త ఎక్కువ కట్టాలి. ఎక్కువ కష్టపడాలని రామరాజుకు చెప్తాడు ధీరజ్. సుక్కు ఏమో కారు ముందుకు వచ్చి వ్లాగ్ చేస్తుంది. సుక్కు అడుగుపెట్టిన వేళా విశేషం మా చిన్న బ్రో కారు కొన్నాడని సుక్కు బిల్డప్ ఇస్తుంది. కారుకు వేదవతి పూజ చేస్తుంది.

ధీరజ్ కొనడం వెనుక నేనున్నాను కాబట్టి, పైగా వాడికి నేనంటే బోలెడు ప్రేమ కాబట్టి ఫస్ట్ కార్లో నన్నే ఎక్కించుకుని తీసుకెళ్తాడని నర్మదతో ప్రేమ చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం అమ్మానాన్నను ఫస...