భారతదేశం, జూన్ 21 -- Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కోపంతో రగిలిపోయిన విశ్వక్.. అమూల్యను యాక్సిడెంట్ చేయాలనుకుంటాడు. కానీ, అక్కడికి ధీరజ్ రావడంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా కారు ఆపుతాడు విశ్వక్.

అమూల్యను డ్రాప్ చేసిన ధీరజ్ తిరిగి మళ్లీ విశ్వక్ దగ్గరికి వచ్చి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావురా, నా చెల్లి వెళ్లే రోడ్డులో నీకెంటీ పని, అసలు నా చెల్లి ఈ రోడ్డులో వస్తుందని నీకెలా తెలుస్తుందని అని చాలా ప్రశ్నలు వేస్తాడు ధీరజ్. దేనికి విశ్వక్ సరిగా సమాధానం చెప్పడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్తిస్తాడు.

పోలీసులకు చెబితే వాళ్లు వచ్చి నిజం కనుక్కుంటారని, మా చెల్లిన వేధిస్తున్నావని మరో కేసు పెడతానని ధీరజ్ అంటాడు. దాంతో భయపడి సారీ చెబుతాడు విశ్వక్. అమూల్య వెళ్లే రోడ్డులోనే కాదు చుట్ట...