భారతదేశం, జూన్ 7 -- Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో వేదవతి తెగ కుమిలిపోతుంది. నర్మద వచ్చి ఓదారుస్తుంది. మేన కోడలు జీవితం బాగుండాలని చిన్నోడిని ఇచ్చి పెళ్లి చేశానని, అలా పెళ్లి చేసి పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుందని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఆయన్ను పెళ్లి చేసుకున్నందుకు పాతికేళ్లుగా చంపుకు తింటున్నారు. అదంతా తెలిసి కూడా చిన్నోడితో ప్రేమ పెళ్లి చేశాను. అప్పటి నుంచి ఏదో రకంగా వాన్ని వేధిస్తూనే ఉన్నారు. వాడికి ప్రేమను ఇచ్చి పెళ్లి చేయకుంటే ఇలా జరిగేది కాదేమో. ధీరజ్‌కు జైళ్లో ఉండేందుకు ఒక రకంగా నేనే కారణం అని పశ్చాత్తాపపడుతుంది వేదవతి.

ఆ మాటలను ప్రేమ వింటుంది. ప్రేమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత భోజనం క్యారేజ్ కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుంది ప్రేమ. తన భర్తకు భోజనం ఇస్తాన...