భారతదేశం, జూలై 6 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 6 ఎపిసోడ్ అదిరిపోయింది. శ్రీవల్లి కడుపు డ్రామాను నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి బయటపెడతారు. ఈ నిజం తెలిసి వేదవతి, చందు ఫైర్ అవుతారు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ప్రేమను నర్మద సీరియస్ గా చూస్తుంది. నా మొగుడు ఆల్రెడీ తిట్టాడు. కొట్టబోయాడు కూడా. ఇక తిట్లు తినే ఓపిక లేదు. కొడితే కొట్టు కానీ అలా చూడకు. కంటిచూపుతో చంపేసేలా ఉన్నావ్ అని ప్రేమ అంటుంది. వెంటనే నర్మద నవ్వేస్తుంది. నీ భర్తపై ఉన్న ప్రేమకు, ఓ స్థాయిలో నిలబెట్టాలనే తపనకు ముచ్చటేస్తుంది. కానీ ఎవరికీ చెప్పకుండా వెళ్లినందుకు కోపంగానూ ఉందని నర్మద అంటుంది.

బల్లి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ రోజు పిల్లలకు నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పేందుకు వెళ్తేనే బీభత్...