భారతదేశం, జూలై 4 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఇంకా రాకపోవడంపై వేదవతి టెన్షన్ పడుతుంది. అప్పుడే నర్మద ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటుంది. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంటుంది.

మరోవైపు ప్రేమను కాపాడిన ధీరజ్ కోప్పడుతాడు. లాగి కొట్టబోయి ఆగిపోతాడు. ఇలాంటి వాళ్ల గురించి న్యూస్ వింటున్నావుగా. ఏం తెలిసి వచ్చావని తిడతాడు ధీరజ్. నీకు కారు కొనివ్వడం కోసంరా. నా భర్త డెలివరీ బాయ్‌గా ఉండటం చూడలేకపోయానురా. ట్రావెల్ బిజినెస్‌లో ఆగిపోయినందుకు, నిన్ను గెలిపించడానికిరా అని ప్రేమ అంటుంది.

ఇంతలో నెక్ట్స్ పార్టిస్‌పెంట్ ప్రేమ అని అనౌన్స్ చేస్తారు. వెళ్లి డ్యాన్స్ చేయమని, ఎలాగు వచ్చావుగా కనీసం ఈ హ్యాపీనెస్ అయినా దక్కని అని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్‌ను హగ్ చేసుకుని వెళ్తుంది ప్రేమ. నర్మద ఫోన్ చ...