భారతదేశం, జూన్ 29 -- Illu Illalu Pillalu June 29th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 29 ఎపిసోడ్ లో వల్లి కడుపు పోయేందుకు నర్మదనే కారణమని వేదవతి, చందు అంటారు. నర్మద చాలా ఫీల్ అవుతుంది. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం ఎలా వెళ్లాలా? అని ప్రేమ ఆలోచిస్తుంటుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

అత్త కొట్టిన చెంప దెబ్బకు, అన్న మాటలకు బయట కూర్చుని నర్మద బాధ పడుతుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్ వస్తారు. అత్తతో మాట్లాడి తేల్చుకుందామని ప్రేమ అంటుంది. కానీ నర్మద ఆపుతుంది. వల్లి కడుపు విషయం అత్తకు తెలియదు. నేను బండిపై తీసుకెళ్లడం వల్లే యాక్సిడెంట్ అయిందని, అబార్షన్ అయిందని అనుకుంటున్నారు. అత్తయ్యకు నా మీద కోపం ఉండటంలో తప్పేం ఉందని నర్మద అంటుంది.

పెద్దోడు, నాన్న గురించి ఆలోచించి వల్లి వదినను వదిలేశాం. అసలు ఆమ...