భారతదేశం, జూన్ 1 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 1 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 1 ఎపిసోడ్ లో.. పుట్టింటి సారె అంటూ వస్తువులు తీసుకొచ్చిన తండ్రి ప్రసాద్ రావుపై నర్మద ఫైర్ అవుతుంది. బుద్ధి లేదంటుంది. ఎవరు తీసుకురమ్మనారంటూ మండిపడుతుంది. నా కూతురిని ఎలా చూసుకోవాలనేది నా బాధ్యత అని ప్రసాద్ రావు అంటాడు.

నాకేం అవసరం లేదని నర్మద చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్. కూతురిని ప్రేమగా చూసుకోవాలనే బాధ్యత ఉంటుంది కదా అని ప్రసాద్ రావు అంటాడు. కూతురిపై ప్రేమ ఉంటే వచ్చి రోజూ చూసుకుని వెళ్లండి. అంతే కానీ ఇలా సామాన్లు తెచ్చి మా నుంచి కొడుకు, కోడలిని ఇంకా విడదీయకండి. ఈ ఇంటిని రెండు ముక్కలు చేసింది సరిపోలేదా, సామాన్లు తీసుకెళ్లండని వేదవతి కూడా కోప్పడుతుంది.

ఎందుకు తీసుకెళ్లాలి అంటూ సాగర్ అప్పుడే వస్తాడు. మనం గతి లేని స్థితిలో ఉన్నామా...