Hyderabad, మే 30 -- తాను నటించిన థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని బెదిరిస్తున్నా.. కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతడు క్షమాపణ చెప్పడానికి శుక్రవారం (మే 30) వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కమల్ మాత్రం అందుకు నిరాకరిస్తూనే ఉన్నాడు.
కన్నడ భాష పుట్టిందే తమిళం నుంచి అని కామెంట్స్ చేసిన కమల్ హాసన్ పై కన్నడ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. అతని సినిమాలను నిషేధించాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగదగియే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమాను తాము నిషేధిస్తామని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చింది.
దీనిపై తాజాగా కమల్ హాసన్ మరోసారి స్పందించాడు. "ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయాన్ని విశ్వసిస్తాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళపై నా ప్రేమ నిజం. ఏదో ఎజెండా ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.