భారతదేశం, మార్చి 5 -- టెహ్రాన్/లండన్: అగ్రరాజ్యం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో, ఆ దేశ తదుపరి అత్యున్నత నేత ఎవరన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో మొజ్తబా వ్యక్తిగత జీవితం, ఆయన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను 'వికీలీక్స్' బయటపెట్టింది.

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విడుదల చేసిన పాత దౌత్య పత్రాల ప్రకారం.. మొజ్తబా ఖమేనీ గతంలో సంతానలేమి (Impotency) సమస్యతో బాధపడ్డారు. దీనికోసం ఆయన బ్రిటన్‌లోని లండన్‌లో ఉన్న వెల్లింగ్టన్, క్రామ్‌వెల్ ఆసుపత్రుల్లో పలుమార్లు చికిత్స పొందారు. 2008లో అమెరికా విదేశాంగ శాఖ లండన్‌లోని తమ ఎంబసీకి పంపిన ఒక రహస్య నివేదికలో ఈ వివరా...