భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో మూడు వారాలుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరిని అణచివేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "ఇరాన్ కోరలు పీకుతున్నారు" అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు అర్థమయ్యే భాషలోనే ట్రంప్ సమాధానం చెబుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రముఖ టీవీ ఛానల్ 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్న బెస్సెంట్, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయక తప్పదని అభిప్రాయపడ్డారు. "ఇప్పటివరకు మనకు ఉన్నది కేవలం భద్రత ఉన్నట్లు కనిపించే ఒక భ్రమ (Illusion of security) మాత్రమే. ఒకవేళ ఇరాన్ మరో రెండేళ్లు తన క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటే, ఆ దేశాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ అయ్యేది కాదు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సాహసోపేత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.