భారతదేశం, జూన్ 23 -- రాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యలోకి అమెరికా కూడా వచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం పడింది. భారత మార్కెట్లు కూడా సోమవారం క్షీణతను చూశాయి. మరోవైపు చమురు ధరల భయం కూడా వెంటాడింది. ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నిలబడ్డాయి.

సోమవారం స్టాక్ మార్కెట్ క్షీణతను చూసింది. సెన్సెక్స్ 511 పాయింట్లు క్షీణించగా. నిఫ్టీ 50 సోమవారం 24,971 వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఆటో స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో నిఫ్టీ 50 సూచీ కీలకమైన 25,000 స్థాయి కంటే దిగువకు పడిపోయింది.

సోమవారం సెన్సెక్స్ 81,704 వద్ద ప్రారంభమై 0.62 శాతం క్షీణతతో రోజు చివరిలో 81,896 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం 24,939 వద్ద ...