భారతదేశం, జూన్ 17 -- తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది.
విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడమైనది.
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.