భారతదేశం, జూన్ 23 -- రాన్‌పై అమెరికా దాడి తర్వాత ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం గురించి భయాందోళనలు మెుదలయ్యాయి. అయితే అమెరికా దాడికి ముందే భారత ప్రభుత్వం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్ నుండి వచ్చే భారతీయ విద్యార్థులలో ఎక్కువ మంది అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో చదువుతున్నారు. ఇరాన్‌లో చదువుతున్న వారిలో 70 నుండి 80 శాతం మంది మెడిసిన్ చదివేందుకే వెళ్లారు.

భారతదేశంలో వైద్య ప్రవేశ పరీక్ష NEET UG చాలా కఠినమైనది. ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. కానీ భారతదేశంలో 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్య కూడా చాలా ఖరీదైనది. ప్రభుత్వ కళాశా...