భారతదేశం, జూన్ 22 -- ొంత కాలం కిందట ఇరాన్‌కు మద్దతిస్తామని పాక్ ప్రకటించింది. ఇస్లామిక్ సౌభ్రాతృత్వం కోసం విజ్ఞప్తి చేసింది. ఇరాన్ పై దాడి జరిగితే ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ అణుదాడి చేస్తుందని కూడా వాదన వినిపించింది. కానీ ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసినప్పుడు పాకిస్థాన్ వెంటనే స్పందించలేదు. చాలా టైమ్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆత్మరక్షణ హక్కు ఇరాన్‌కు ఉందని పేర్కొంది.

ట్రంప్-మునీర్‌ల భేటీ ఫలితమే పాక్ ఈ మౌనానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి పాకిస్థాన్ ఇరాన్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడం మానేసింది. కొంతకాలం క్రితం ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ పెద్ద పెద్ద మాటలు చెప్పింది. ఈ విషయాలు చెప్పింది మరెవరో కాదు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ...