భారతదేశం, మే 20 -- అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. "మర్యాదగా దారికి వస్తారా.. లేక భారీ దెబ్బ తింటారా?" అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి అల్టిమేటం జారీ చేశారు. వైట్ హౌస్ వేదికగా ఎంపీలతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌తో యుద్ధాన్ని చాలా త్వరగా ముగిస్తానని ప్రకటించారు. అయితే, చర్చల ద్వారా ఒప్పందం కుదరకపోతే మాత్రం మరోసారి దాడులు ప్రారంభించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై తిరిగి దాడులు చేయడానికి ట్రంప్ ఒక చిన్నపాటి గడువును కూడా ప్రకటించారు. "వచ్చే రెండు మూడు రోజుల్లో.. బహుశా శుక్రవారం, శనివారం లేదా ఆదివారం లోపు ఏదో ఒకటి తేలాలి. లేదంటే వచ్చే వారం ఆరంభంలోనే భారీ సైనిక చర్య ఉంటుంది" అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని తయారు చేయనివ...