భారతదేశం, మార్చి 13 -- మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా వైమానిక దళానికి ఊహించని షాక్ తగిలింది. ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన కేసీ-135 (KC-135) మిలిటరీ విమానం గురువారం ప్రమాదానికి గురై కుప్పకూలింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా సైనిక కదలికలు చేపడుతుండగా ఈ ఘటన జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ధృవీకరించింది.

పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిషన్‌లో మొత్తం రెండు విమానాలు పాల్గొనగా, అందులో ఒకటి కూలిపోయింది. రెండో విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం కూలిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్, అందులోని సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

"రెండు విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అందులో ఒకటి పశ్చిమ ఇరాక్‌లో కూలిపోగా, రెండోది సురక్షితంగా దిగింది" అని సెంట్రల్...