భారతదేశం, మే 28 -- సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన ప్లాట్‌ఫామ్‌లపై కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగదారుల కోసం 'ప్లస్' పేరిట పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉచితంగా లభించే ఫీచర్లకు అదనంగా, యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

మెటా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సబ్‌స్క్రిప్షన్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం ప్రకటించిన అంతర్జాతీయ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

"ఈ కొత్త ప్లాన్‌లు మా యాప్‌ల ద్వారా యూజర్లు తమ క్రియేటివిటీని చాటుకోవడానికి మరిన్ని మార్గాలను అందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఫీచర్లను ఇందులో జోడిస్తాం" అని మెటా ప్రొడక్ట్ హెడ్ నయోమి గ్లెయిట్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు.

కేవలం డబ్...