భారతదేశం, జూలై 13 -- జీవితంలో సరైన వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. అలా అయితేనే పదవీ విరమణ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు. కెరీర్ ప్రారంభంలో మీ డబ్బును ఆదా చేసి సరైన ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలి. మీ భవిష్యత్తు ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఆర్థిక నిర్వహణలో చిన్న తప్పు చేసినా ఇబ్బందుల్లో పడవచ్చు. పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు ఏ తప్పులు చేయకూడదనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కెరీర్‌ను ప్రారంభించడం మంచిది. ఈ వయస్సులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లయితే కొన్ని తప్పులు చేయడం మానేయండి.

జీవితంలో మనం ఎంత త్వరగా డబ్బు ఆదా చేయడం ప్రారంభిస్తే అంత మంచిది. కొంతమంది ఇప్పటికే తమ విద్యను పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరుతారు. విద్యార్థి రుణాలు, ఇంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ నిర్వహించడం చాలా కష్టం. మీరు ఎటువంటి ఇబ్బందులకు...