భారతదేశం, ఏప్రిల్ 15 -- అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు గత మార్చి నెలలో స్టాక్ మార్కెట్లను కుదిపేసిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్ల కాలంలో సూచీలు అత్యంత దారుణమైన నెలవారీ పతనాన్ని నమోదు చేశాయి. సాధారణంగా ఇటువంటి సమయాల్లో విదేశీ ఇన్వెస్టర్లు (FII) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని పారిపోతుంటారు. కానీ, భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మార్కెట్ తగ్గడాన్ని ఒక సువర్ణావకాశంగా భావించి, భారీ ఎత్తున షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఫిబ్రవరి నెలలో ఈక్విటీ ఫండ్లలోకి రూ. 26,000 కోట్ల పెట్టుబడులు రాగా, మార్చి నాటికి ఆ సంఖ్య ఏకంగా 56 శాతం పెరిగి రూ. 40,500 కోట్లకు చేరుకుంది. ఇది గడచిన ఎనిమిది నెలల కాలంలోనే అత్యధికం. మదుపర్లు ఇప్పుడు గందరగోళానికి లోనుకాకుండా, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడు...