భారతదేశం, సెప్టెంబర్ 10 -- Yami Gautam Nayi Naveli Teaser Released: బాలీవుడ్ విలక్షణ నటి యామీ గౌతమ్ ధర్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఫ్యామిలీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయీ నవేలీ' టీజర్‌ను ఇవాళ (సెప్టెంబర్ 10) విడుదల చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, కలర్ ఎల్లో సంయుక్తంగా నయీ నవేలి సినిమాను నిర్మిస్తున్నాయి. దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

సాధారణంగా సాగుతున్న ఓ ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన వధువు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఇంటిల్లిపాదికి "మా వదినో మంత్రగత్తె" అని మరిది చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది.

మరిది...